KDP: ప్రొద్దుటూరుకు చెందిన రెడ్డితోట సువర్ణ పేదరికం చదువుకు అడ్డంకి కాదని నిరూపించింది. యోగి వేమన విశ్వవిద్యాలయంలో ఎంఏ హిస్టరీలో ప్రతిభ కనబర్చిన ఆమెకు శుక్రవారం జరగనున్న వైవీయూ స్నాతకోత్సవంలో గోల్డ్ మెడల్ అందజేయనున్నారు. కుటుంబ పరిస్థితుల కారణంగా ప్రొద్దుటూరులోని రిలయన్స్ మార్ట్లో పిజ్జా సర్వర్గా పనిచేస్తున్న సువర్ణకు ప్రజలు అభినందనలు తెలిపారు.