BHPL: ప్రతిభావంతులైన క్రీడాకారులను ప్రోత్సహించడంలో పోలీసు అధికారులు ఎప్పుడూ ముందుంటారని SI కృష్ణ ప్రసాద్ అన్నారు. రేగొండ (M) పెద్దంపల్లి గ్రామానికి చెందిన మూగ క్రికెటర్ రాజు జాతీయ స్థాయి క్రికెట్ పోటీలకు ఎంపికయ్యారు. క్రికెట్ కిట్ కొనుక్కోవడానికి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న SI కృష్ణ ప్రసాద్ ఇవాళ రాజుకు రూ. 5000 వేలు అందజేశారు.