NLG: సీఐటీయూ జిల్లా 13వ మహాసభలు ఈనెల 14,15 తేదీల్లో నల్గొండలో నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య, హమాలి ఫెడరేషన్ జిల్లా ఉపాధ్యక్షులు కానుగు లింగస్వామి తెలిపారు. కనగల్లో గురువారం మహాసభల కరపత్రాలను వారు ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. జిల్లాలోని వివిధ మండలాల నుండి 500 మంది ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు.