హన్మకొండ(Hanmakonda) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) చోటుచేసుకుంది. ఆదివారం సాయంత్రం జరిగిన ఈ ప్రమాదంలో నలుగురు దుర్మరణం(4 Died) చెందారు. ఈ ఘటనలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలు(2 Injured) అయ్యాయి. కటక్షాపూర్ నుంచి ఆత్మకూరు వెళ్తున్న రోడ్డు మార్గంలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం(Accident) జరిగింది.
కారులో మేడారం వెళ్లి వస్తుండగా కారు, టిప్పర్ ఢీకొన్నాయి. రోడ్డు రక్తమోడింది. ఆ ప్రాంతం అంతా చిన్నాభిన్నమైంది. స్థానికులు ప్రమాదం(Accident)లో గాయపడిన వారిని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. నలుగురు అక్కడికక్కడే దుర్మరణం(4 Died) చెందగా మరో ఇద్దరి పరిస్థితి మాత్రం విషమం(2 Injured)గా ఉందని అధికారులు తెలిపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతుల వివరాలను ఆరా తీస్తున్నారు. ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.