టాలీవుడ్(Tollywood) హీరో శ్రీవిష్ణు(Srivishnu) ‘సామజవరగమన’ అనే చిత్రం(Samajavaragamana Movie)లో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. శ్రీవిష్ణు ఖాతాలో ఇప్పటి వరకూ ఏ సినిమా సరైన విజయం సాధించలేదు. అయినప్పటికీ కొత్త కథలను ఎంచుకుంటూ వరుస సినిమాలు చేస్తూ వస్తున్నారు. సామజవరగమన మూవీ జూన్ 29వ తేదిన విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) చేతుల మీదుగా మేకర్స్ ట్రైలర్ ను రిలీజ్(Trailer Release) చేశారు. ఈ మూవీకి రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించారు.
‘సామజవరగమన’ ట్రైలర్:
‘సామజవరగమన’ మూవీ(Samajavaragamana Movie) ట్రైలర్ ప్రధానంగా కామెడీతో సాగింది. హీరో శ్రీవిష్ణు మరోసారి తనలోని కామెడీ యాంగిల్ ను చూపించారు. ట్రైలర్ (trailer)లో కొన్ని యాక్షన్ సీన్స్ కట్ చేసి చూపించారు. అమ్మాయిలకు దూరంగా ఉండే ఓ అబ్బాయి జీవితంలో ఏం జరిగిందనే విషయాలను ఈ మూవీలో చూపించారని ట్రైలర్ (Trailer)ను చూస్తేనే అర్థమవుతోంది.
మూవీలో హీరో ప్రతి అమ్మాయి చేత రాఖీలు కట్టించుకుంటాడు. ఆ తర్వాత హీరోయిన్ తో లవ్‌లో పడటంతో తన మద్యతరగతి లైఫ్ ఎలా సాగిందనేది మూవీ చూస్తేనే తెలుస్తుంది. ఇందులో హీరో తండ్రి పాత్రలో సీనియర్ నటుడు నరేశ్(Naresh) కనిపించాడు. వాడి దృష్టిలో ఫ్యామిలీ మెంబర్స్ అంటే కేజీఎఫ్‌లో బానిసలు అని నరేవ్ చెప్పే డైలాగ్ ట్రైలర్‌కు హైలెట్‌గా నిలిచింది.
‘సామజవరగమన’ చిత్రం(Samajavaragamana Movie)లో శ్రీవిష్ణు(Srivishnu)కు జోడీగా రెబా మోనికా జాన్ నటిస్తోంది. ఈ మూవీలో సుదర్శన్, శ్రీకాంత్ అయ్యంగార్, వెన్నెల కిషోర్, రఘుబాబు, రాజీవ్ కనకాల, దేవీ ప్రసాద్, ప్రియ వంటివారు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాకు గోపీ సుందర్(Gopisundar) మ్యూజిక్ అందిస్తున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్ పతాకంపై అనిల్ సుంకర ఈ మూవీని సమర్పిస్తున్నారు. జూన్ 29న ఈ మూవీ రిలీజ్ కానుంది.