MNCL: కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని IFTU ఆధ్వర్యంలో మార్చి 16న కలెక్టరేట్ల ముట్టడిని విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. బెల్లంపల్లి సింగరేణి సివిల్ కార్యాలయ ఆవరణలో పోస్టర్లను విడుదల చేశారు. జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడుతూ.. కార్మికులు సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దుచేసి 4 లేబర్ కోడ్ల అమలు సరికాదన్నారు.