»Bandla Ganeshs Political Re Entry Tweet Saying He Is Coming For Congress Party
Bandla Ganesh: బండ్ల గణేష్ పొలిటికల్ రీఎంట్రీ..కాంగ్రెస్ పార్టీ కోసం వస్తున్నానంటూ ట్వీట్
సినీ నిర్మాత బండ్ల గణేష్ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటారు. తాజాగా తాను కాంగ్రెస్ లోకి రీఎంట్రీ ఇస్తున్నట్లు భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ లో పాల్గొంటున్నట్లు ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆయన చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది.
రాజకీయాల(politics) పరంగా గత కొన్ని రోజులుగా మౌనంగా ఉన్న బండ్ల గణేష్(Bandla Ganesh) తాజాగా తన స్వరం వినిపిస్తున్నాడు. గతంలో ఆయన కాంగ్రెస్ పార్టీ(Congress Party) తరపున తన మాటల్ని వినిపించారు. తాజాగా బంగ్ల గణేష్ ట్వీట్ చేశారు. అన్నా వస్తున్నా..అడుగులో అడుగేస్తా, చేతిలో చెయ్యేస్తానంటూ ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో తాను పాల్గొంటున్నట్లు బండ్ల గణేష్ తెలిపారు.
బండ్ల గణేష్ చేసిన ట్వీట్:
అన్నా వస్తున్నా అడుగులో అడిగేస్తా చేతిలో చెయ్యేస్తా కాంగ్రెస్ పార్టీ కోసం కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం అన్నిటికీ సిద్ధపడి తెలంగాణ అభివృద్ధి కోసం మీరు చేస్తున్న ఈ అద్భుతమైన పాదయాత్రలో పాలుపంచుకోటానికి మిమ్మల్ని కలవడానికి సూర్యాపేటకు వస్తున్నాను. జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్… https://t.co/ZTmWiMcCaL
భట్టిని కలిసేందుకు తాను సూర్యపేట వెళ్తున్నానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ(Congress Party) అధికారం కోసం అన్నింటికీ సిద్ధపడి తెలంగాణ అభివృద్ధి కోసం భట్టి చేస్తున్న పాదయాత్రలో పాలుపంచుకోవటానికి, సూర్యపేటకు వస్తున్నానంటూ ట్విట్టర్ వేదికగా బండ్ల గణేష్(Bandla Ganesh) ట్వీట్ చేశారు. తన నోట్ లో జై కాంగ్రెస్, జైజై కాంగ్రెస్ అంటూ నినాదాలు చేశారు.
గత ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ(Congress Party) ఓటమిపాలవ్వడంతో బండ్ల గణేష్(Bandla Ganesh) రాజకీయాలకు కాస్త దూరంగా ఉంటూ వచ్చారు. అయితే కాంగ్రెస్ పార్టీలో ఆయన కొనసాగుతున్నప్పటికీ తాను మాత్రం ఎలాంటి హడావుడి చేయలేదు. తాజాగా తెలంగాణలో మారుతున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆయన ట్వీట్(Tweet) అందరిలో ఆసక్తిని రేపుతోంది.