AP: సీఎం చంద్రబాబు నిర్లక్ష్యం వల్లే ఆలయాల్లో అపచారాలు జరుగుతున్నాయని వైసీపీ నేత మల్లాది విష్ణు ధ్వజమెత్తారు. టీటీడీ లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు విష ప్రచారం తర్వాత రాష్ట్రంలోని ఆలయాల్లో అనేక సంఘటనలు జరుగుతూనే ఉన్నాయన్నారు. చంద్రబాబు నిర్లక్ష్యం కారణంగా ఆలయాలకు వెళ్లిన భక్తులు క్షేమంగా తిరిగి వస్తారో లేదో అనే అనుమానం కలుగుతోందన్నారు.