WGL: రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న “ప్రజాపాలన-ప్రగతి” కార్యక్రమంలో భాగంగా నర్సంపేటలో ఇవాళ సర్పంచులు, కౌన్సిలర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఛైర్మన్ శ్రీలక్ష్మీ-రామానంద్ హాజరై మాట్లాడుతూ.. 99 రోజుల ప్రణాళికను విజయవంతం చేయాలని కోరారు. నర్సంపేటను ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దుతామని, ప్రభుత్వ సేవలను ప్రజల వద్దకు తీసుకెళ్తామని అన్నారు.