KKD: పిఠాపురం పాదగయ జంక్షన్ వద్ద CI శ్రీనివాస్ ఆటో డ్రైవర్లకు అవగాహన సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం జరుగుతున్న సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్టు మోసాలు, ఏటీఎం కార్డు మార్పిడి మోసాలు గురించి అవగాహన కల్పించారు. అలాగే ట్రాఫిక్ నియమాలు తప్పనిసరిగా పాటించాలని, ప్రమాదాలను నివారించేందుకు జాగ్రత్తగా వాహనాలు నడపాలని సూచించారు.