కృష్ణా: గుడివాడ స్లేటర్ పేట, బేతవోలు ప్రాంతాల్లో గురువారం హెచ్‌పీవీ వాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్వేత మాట్లాడుతూ.. హెచ్‌పీవీ టీకా క్యాన్సర్‌ను నివారించడంలో అత్యంత ప్రభావంతంగా పనిచేస్తుందని తెలిపారు. 9–14 ఏళ్ల బాలికలు లైంగిక క్రియాశీలతకు ముందు టీకా వేయించడం వల్ల రక్షణ లభిస్తుందని స్పష్టం చేశారు.