యుద్ధం కారణంగా ఇరాన్ ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. ఇరాన్ నుంచి ఇతర ప్రాంతాలకు 32 లక్షల మంది ప్రజలు వెళ్లారు. టెహ్రాన్, ఇతర నగరాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు వెళ్లారని ఐరాస వెల్లడించింది. రాజధాని టెహ్రాన్‌తో పాటు ఇతర పారిశ్రామిక నగరాల నుంచి ప్రజలు వెళ్ళిపోవడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ, నిత్యావసర సేవలపై తీవ్ర ప్రభావం పడుతుంది.