VZM: జిల్లాలో ఎలాంటి గ్యాస్ కొరత లేదని, గృహ అవసరాలకు గ్యాస్ సరఫరా సాధారణంగా కొనసాగుతోందని జాయింట్ కలెక్టర్ సేధు మాధవన్ గురువారం తెలిపారు. సోషల్ మీడియాలో వస్తున్న గ్యాస్ కొరత వార్తలు అవాస్తవమన్నారు. గ్యాస్ బుకింగ్‌కు 25 రోజుల గడువు మాత్రమే ఉంటుందని, అవసరానికి మించి సిలిండర్లు నిల్వ చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.