విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ విభాగం ఆధ్వర్యంలో ఏప్రిల్ 6 నుంచి 10 వరకు ఐదు రోజుల వర్క్‌షాప్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను గురువారం ఏయూ ఉపకులపతి ఆచార్య జి.పి. రాజశేఖర్ తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య కే. రాంబాబు పాల్గొన్నారు.