Ram charan: బిడ్డను తొలిసారి తాకగానే ఎలాంటి అనుభూతి కలుగుతుందో, ఆనందం కలుగుతుందో తనకు అలానే కలిగిందని రామ్ చరణ్ (Ram charan) అన్నారు. ఎన్నో ఏళ్ల నుంచి చూస్తోన్న తరునం వచ్చిందని.. ఓ తండ్రికి ఇంతకన్నా ఆనందం ఏముంటుందని కామెంట్ చేశారు. ఆ ఆనందంలో మాటలు కూడా రావడం లేదన్నారు. అపోలో ఆస్పత్రి ప్రాంగణంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
ఉపాసనకు సుఖ ప్రసవం చేసిన డాక్టర్ సుమన, ఉమా, తల, సుబ్బారెడ్డి, అమితా, ఇంద్రసేన, తేజస్వినీ, అపోలో స్టాఫ్కు రామ్ చరణ్ (Ram charan) కృతజ్ఞతలు తెలిపారు. సుఖ ప్రసవం జరిగిందని, తల్లీ, బిడ్డ ఆరోగ్యంగా ఉండటంతో ఈ రోజు డిశ్చార్జ్ చేశారని వివరించారు. మెగా అభిమానులకు, శ్రేయోభిలాసులకు చెర్రీ కృతజ్ఞతలు తెలిపారు. మీ ప్రేమ తన బిడ్డపై ఎప్పుడూ ఉండాలని కోరారు. 21వ రోజున పాపకు పేరు పెడతాం.. ఉపాసన, తాను ఓ పేరు అనుకున్నాం అని చరణ్ (charan) వివరించారు. ఆ రోజు అందరికీ చెబుతాం అని వివరించారు. పాపది నాన్న పోలికే అని చరణ్ (charan) నవ్వుతూ సమాధానం ఇచ్చారు.
రామ్ చరణ్- ఉపాసనకు పెళ్లైన 11 ఏళ్లకు సంతానం కలిగింది. మంగళవారం రోజున పాప జన్మించింది. తమ ఇంటికి మెగా ప్రిన్సెస్ వచ్చిందని మెగా, కామినేని ఫ్యామిలీ ఆనందంలో మునిగితేలింది. మెగా అభిమానులు కూడా ఫుల్ ఖుషీలో ఉన్నారు.