GNTR: ప్రమాదకరమైన గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్‌ను రూపుమాపేందుకు ప్రభుత్వం చేపట్టిన HPV వ్యాక్సినేషన్ కార్యక్రమం తెనాలిలో ముమ్మరంగా జరుగుతోంది. ఈ నెల 9 నుంచి పట్టణ, రూరల్ పరిధిలోని అన్ని ఆరోగ్య కేంద్రాలలో 14ఏళ్ల వయసున్న బాలికలకు వైద్యులు వ్యాక్సిన్ వేస్తున్నారు. గురువారం టీచర్స్ కాలనీ శివారులోని ఆరోగ్య కేంద్రంలో వ్యాక్సినేషన్ చేపట్టారు.