NLG: చిట్యాల తహశీల్దార్ కార్యాలయంలో గత రెండు రోజులుగా రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. గత తహశీల్దార్ ఏసీబీకి పట్టుబడటంతో, డీటీకి ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇచ్చారు. అయితే ఆమె ఫీల్డ్ వర్క్, జనగణన శిక్షణలో ఉండటంతో కార్యాలయానికి రావడం లేదు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేక రైతులు రోజుల తరబడి తిరుగుతున్నారు. వరుస సెలవులతో సోమవారం వరకు సేవలు లభించకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.