SRD: డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ పైలట్‌గా జిల్లా ఎంపికైనట్లు మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గురువారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు చెప్పారు. సమావేశంలో కలెక్టర్ ప్రావీణ్య పాల్గొన్నారు.