ADB: నేరడిగొండ మండలంలోని బోరిగం గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాదంలో నాలుగు ఇళ్లు, రెండు పశువుల కొట్టాలు పూర్తిగా కాలిపోవడంతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ విషయం తెలుసుకున్న బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ గజేందర్ గ్రామానికి చేరుకుని బాధిత కుటుంబాలను పరామర్శించారు. అగ్ని ప్రమాదంలో ఇళ్లు కోల్పోయిన కుటుంబాలను ప్రభుత్వం తరఫున ఆదుకుంటమన్నారు.