Lavanya Tripathi: లావణ్య త్రిపాఠి ఫోన్ వాల్‌పేపర్ చూశారా? అందులో ఏముందో తెలుసా?
గత కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి.. ఎట్టకేలకు ఇరు కుటుంబాలను ఒప్పించి.. జూన్ 9న ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. త్వరలోనే ఈ ఇద్దరు పెళ్లి చేసుకుని వివాహం బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఇప్పటికే విదేశాల్లో పెళ్లికి సంబంధించిన షాపింగ్ అప్పుడే స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇలాంటి సమయంలో తన ఫోన్ వాల్ పేపర్‌ను షేర్ చేసుకుంది లావణ్య.
త్వరలోనే మెగా కోడలుగా మెగా ఫ్యామిలీలోకి అడుగుపెట్టబోతున్న లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi).. సోషల్ మీడియాలో ఎంతో యాక్టీవ్‌గా ఉంటుంది. రీసెంట్గా చరణ్, ఉపాసన దంపతులకు బిడ్డ పుట్టిన సందర్భంగా.. సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేసింది. అలాగే ఎప్పటికప్పుడు తన పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటుంది. ఈ క్రమంలో తన ఫోన్ వాల్‌పేపర్‌ను ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేసింది లావణ్య.
అందులో కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి.. ప్రత్యేక సందర్భాల్లో దిగిన కొన్ని ఫొటోలు ఉన్నాయి. వాటిలో తనకు కాబోయే భర్త వరుణ్ తేజ్‌తో కలిసి వేకేషన్లో దిగిన పిక్ కూడా ఉంది. ఈ పిక్ లో ‘మై లవ్స్.. డ్రీమ్ బిగ్గర్’ అంటూ క్యాప్షన్ జోడించింది. ప్రస్తుతం ఈ ఫోటోలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇకపోతే.. ‘మిస్టర్’ సినిమాలో వరుణ్, లావణ్య కలిసి ఫస్ట్ నటించారు. ఈ సినిమా చిత్రీకరణ సమయంలోనే ఈ ఇద్దరూ ప్రేమలో పడ్డారు. అయినా కూడా ఎప్పటికప్పుడు ప్రేమ వార్తలను పుకార్లు అంటూ కొట్టిపారేశారు.
అయితే ఫైనల్‌గా ఎంగేజ్మెంట్ చేసుకొని షాక్ ఇచ్చారు. ఈ ఏడాదిలోనే వీరి పెళ్లి జరగనుంది. వరుణ్ తేజ్ ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు డైరెక్షన్లో గాండీవధారి అర్జున చిత్రంలో నటిస్తున్నాడు. డెబ్యూ డైరెక్టర్ శక్తి ప్రతాప్ సింగ్ హడ దర్శకత్వంలోను ఓ సినిమా చేస్తున్నాడు. లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi) చేతిలోను కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వెబ్‌సిరీస్‌లు కూడా చేస్తోంది. అయితే.. పెళ్లి తర్వాత లావణ్య సినిమాలు చేస్తుందా? లేదా మానెస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది.