సత్యసాయి: పుట్టపర్తిలో పలు హోటళ్లు, రెస్టారెంట్లలో తహశీల్దార్ కళ్యాణ్ చక్రవర్తి, సీఎస్డీటీ రామకృష్ణ గురువారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. హోటళ్ల వంటగదులను పరిశీలించి సిలిండర్ల వినియోగాన్ని పరిశీలించారు. వాణిజ్య అవసరాల కోసం కమర్షియల్ సిలిండర్లు మాత్రమే ఉపయోగించాలని, వాటికి బదులుగా తక్కువ ధరకే లభించే గృహ వినియోగ సిలిండర్లను వాడటం చట్టవిరుద్ధమని తెలిపారు.