Divorce: విడాకుల వివాదం..జడ్జి కారు ధ్వంసం చేసిన వ్యక్తి
కేరళలో ఓ వ్యక్తి జడ్జీ కారుపై తన ప్రతాపం చూపించాడు. తన విడాకుల కేసులో వాదనలు వినడం లేదని ఆగ్రహాంతో ఊగిపోయాడు. కోర్టు బయట కనిపించిన కారు అద్దాలు పగలగొట్టి తన కోపాన్ని తీర్చుకున్నాడు.
Kerala Man: ఓ వ్యక్తి జడ్జీ కారునే ధ్వంసం చేశాడు. ఫ్యామిలీ కోర్టులో అతని విడాకుల కేసు సాగదీయడం కారణం అని తెలుస్తోంది. పైగా అతని వాదనను లాయర్ (lawyer), జడ్జీ (judge) వినలేదట. ఇంకేముంది.. జడ్జీ (judge) కారుపై తన ప్రతాపం చూపించాడు. కారును ధ్వంసం చేసి కటకటాల పాలయ్యాడు. ఈ ఘటన కేరళలో (kerala) గల పథనంతిట్ట జిల్లాలో జరిగింది.
విడాకుల కోసం దంపతులు 2017లో పథనంతిట్ట కోర్టును (court) ఆశ్రయించారు. తీర్పు ఇవ్వగా.. దానిపై నమ్మకం లేదని కేరళ హైకోర్టును వివాహిత భర్త ఆశ్రయించాడు. కేసును ఫ్యామిలీ కోర్టుకు కేరళ హైకోర్టు (kerala high court) బదిలీ చేసింది. ఈ కేసు విచారణ బుధవారం జరిగింది. తనకు న్యాయం జరగడం లేదని ఆ భర్త (husband) భావించాడు. న్యాయవాది, జడ్జీ తన గోడు వినడం లేదని అంటున్నారు.
కోర్టు (court) నుంచి బయటకు వచ్చిన అతను కోపంతో రగిలిపోయాడు. అక్కడ కనిపించిన జడ్జీ (judge) కారును (car) ధ్వంసం చేశాడు. అద్దాలు పగలగొట్టి బీభత్సం సృష్టించాడు. వెంటనే స్పందించిన పోలీసులు (police) అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఎఫ్ఐఆర్ (fir) నమోదు చేశామని తెలిపారు. విడాకులు కావాలని అతని భార్య కోర్టును ఆశ్రయించారు. విడాకుల కోసం అతని భార్యే కోర్టును ఆశ్రయించిందట.. తన వెర్షన్ వినడం లేదని.. ఇంతలో తీర్పు వ్యతిరేకంగా వస్తోందని భావించారు.