NLR: బుచ్చి, కోవూరు మండలాల్లోని అంగన్వాడీ కేంద్రాలను, ప్రభుత్వ పాఠశాలను ఫుడ్ కమిషన్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. విద్యార్థులకు పెట్టే పోషక ఆహారాలను పరిశీలించారు. పాటూరు అంగన్వాడీ కేంద్రంతో పాటు దామర మడుగులోని అంగన్వాడీ కేంద్రం, జడ్పీ హైస్కూల్లో లోపాలను గుర్తించి వారికి షోకాజ్ నోటీసు అందించామని ఫుడ్ కమిషన్ మెంబర్ లక్ష్మీరెడ్డి తెలిపారు.