MBNR: జిల్లా కేంద్రంలోని పాత డీఈవో కార్యాలయ చౌరస్తాలో చార్వాక క్యాలెండర్ను సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మైత్రి యాదయ్య శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చార్వాక ఉద్యమం 3,000 సంవత్సరాలకు క్రితమే ఉందని అన్నారు. కార్యక్రమంలో నాస్తిక సమాజం జిల్లా అధ్యక్షులు చింతకింది జనార్దన్, బీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు పట్నం చెన్నయ్య పాల్గొన్నారు.