VSP: వైసీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆరిలోవ 11వ వార్డు బాలాజీ నగర్లో ఇవాళ వార్డు అధ్యక్షుడు ముగడ రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. మహా విశాఖ మాజీ మేయర్ గొలగాని హరి వెంకట కుమారి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని వైసీపీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వైసీపీ కోట్లాది అభిమానుల పార్టీగా ఎదిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.