పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం ప్రభాస్ ఇండియాలోనే టాప్ మోస్ట్ హీరోలలో ఒకరని చెప్పడంలో.. ఎలాంటి సందేహం లేదు. ఇక సెట్స్ పై ఉన్న ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కె లాంటి పాన్ ఇండియా చిత్రాలు ప్రభాస్‌ను నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లడం పక్కా అంటున్నారు. అయితే ఈ సినిమాల్లో నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ప్రాజెక్ట్ కె.. పాన్ వరల్డ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోంది. సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్లో దాదాపు 500 కోట్ల బడ్జెట్‌తో.. వైజయంతీ మూవీస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను రూపొందిస్తోంది. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాను.. త్వరలోనే కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేయబోతున్నారు. అయితే అతి త్వరలోనే ఈ సినిమా నుంచి బిగ్ అప్డేట్ రాబోతున్నట్టు తెలుస్తోంది. ఇండస్ట్రీ వర్గాల ప్రకారం.. కొత్త సంవత్సరం కానుకగా బిగ్ సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నాడట దర్శకుడు నాగ్ అశ్విన్. అయితే ఆ సర్ప్రైజ్ ఏంటనేది క్లారిటీ లేకపోయినా.. ప్రభాస్ ఫ్యాన్స్‌కు అదిరిపోయేలా ఉందంటున్నారు. ఇప్పటి వరకు ప్రాజెక్ట్ కె నుంచి ప్రీ లుక్ పోస్టర్స్ మాత్రమే రిలీజ్ చేశారు. అసలు ఈ సినిమాలో ప్రభాస్ లుక్ ఎలా ఉంటుందనే ఆసక్తి అందరిలోను ఉంది. అలాగే టైటిల్ కోసం ఎగ్జైటింగ్‌గా ఎదురు చూస్తున్నారు. దాంతో ప్రాజెక్ట్ కె నుంచి ఎలాంటి అప్డేట్ రాబోతోందనేది సస్పెన్స్‌గా మారింది. రేపో, మాపో దీనిపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. ఇకపోతే.. ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొనే హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో.. దిశా పటాని, అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్నారు.