కడప జిల్లాలో 81,345 విద్యుత్ సర్వీసులకు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేశారు. కడప డివిజన్లో 23,250, మైదుకూరులో 14,305, ప్రొద్దుటూరులో 30,304, పులివెందులలో 13,486 సర్వీసులకు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేశారు. స్మార్ట్ మీటర్లు విద్యుత్ వినియోగాన్ని పారదర్శకంగా చూపిస్తాయని ఎస్ఈ రమణ తెలిపారు. బిల్లులు ఆటోమేటిక్గా రూపొందుతాయన్నారు.