NRML: నిర్మల్ ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించారు. కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేలా విస్తృత ప్రచారం చేయాలని, జిల్లా చరిత్రను ప్రతిబింబించే కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సూచించారు.