MHBD: పెద్దవంగర మండల కేంద్రానికి చెందిన శ్రీరాం సాయి వెంకట్ రూ.95వేల మొబైల్ కేవలం రూ.9,500లకే వస్తుందని వీడియోలో ఉన్న నెంబర్కు కాల్ చేశారు. మొదటగా రూ.899 పంపించారు. సైబర్ నేరగాళ్లు పలుమార్లు మొత్తం రూ.86,700 ఫోన్ పే ద్వారా బ్యాంకు ఖాతా నుంచి డెబిట్ చేశారు. దీంతో బాధితుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.