»A Young Man Died While Dj Dancing At A Wedding Etah Uttar Pradesh
Viral video: పెళ్లిలో డీజే డాన్స్ చేస్తూ యువకుడు మృతి
ఓ పెళ్లి ఊరేగింపులో యువకుడు డ్యాన్స్ చేస్తూ ఆకస్మాత్తుగా నెలకూలాడు. అంతే ఇక పైకి లేవలేదు. తీరా తర్వాత నెమ్మదిగా తెరుకున్న స్థానికులు అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లగా..గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని ఎటాహ్లో చోటుచేసుకుంది.
ఓ చోట వధూవరులకు పెళ్లి జరిగింది. ఆ తర్వాత DJ పెట్టి ఫుల్ కుషితో పలువురు డాన్స్(dance) చేస్తున్నారు. అదే క్రమంలో ఓ వ్యక్తి ఒక్కసారిగా కిందపడిపోయాడు. అయినా కూడా పక్కనున్న వారు ఊరికే పడ్డాడని అనుకున్నారు. ఆ వ్యక్తికి గుండెపోటు వచ్చిందన్న విషయం తెలియక మిగతా డ్యాన్సర్లు డ్యాన్స్ చేస్తూనే ఉన్నారు. కానీ ఎంతసేపటికీ అతను పైకి లేవకపోవడంతో ఆందోళన చెందిన స్థానికులు అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆ క్రమంలో వైద్యం చేసిన వైద్యులు గుండెపోటు(heart attack)తో అతను మృతి చెందినట్లు పేర్కొన్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కోడుతుంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్(uttar pradesh)లోని ఎటాహ్(etah)లో ఇటీవల జరిగింది. ఈ వీడియో చూసిన పలువురు అనేక రకాలుగా స్పందిస్తున్నారు. సడన్ హార్ట్ ఎటాక్ లకు కారణం కరోనా టీకాల దుష్ప్రభావమని కామెంట్లు చేస్తున్నారు.
మరో ఘటనలో 52 ఏళ్ల మహేంద్ర శర్మ అనే వ్యక్తి కూడా గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. బ్యాడ్మింటన్ ఆట ఆడుతున్న క్రమంలో ఒక్కసారిగా విషాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనతో అందరూ ఉలిక్కిపడ్డారు. ఆ వ్యక్తి గుండెపోటుతో మరణించాడు. అతడిని కాపాడేందుకు రకరకాల ప్రయత్నాలు చేసినా ఆ వ్యక్తిని కాపాడలేకపోయారు. ఇది చూసిన పలువురు తీవ్రమైన వేడి సమయంలో బ్యాడ్మింటన్ ఆడటం అవసరమా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇంకొంత మంది అయితే ఇది కోవిడ్ వ్యాక్సిన్ల ప్రభావమేనని అంటుండగా.. మరోవ్యక్తి ఈ సంఘటన దురదృష్టకరమని వ్యాఖ్యలు చేశారు.
17 June 23 : 🇮🇳 : The young man died of heart attack💉 while dancing at the wedding, the incident was caught on camera, the procession went from Etah district of Uttar Pradesh#heartattack2023#TsunamiOfDeathpic.twitter.com/KdFZLEeHnc