PDPL: జిల్లా కలెక్టర్, మంత్రి లక్ష్మణ్ కుమార్ ఆదేశాల మేరకు ప్రజా ప్రతినిధుల సహకారంతో ధర్మారం మండల పరిషత్ అభివృద్ధికి కృషి చేస్తానని ఇటీవల బదిలీపై వచ్చిన ఎంపీడీవో సుమలత అన్నారు. గురువారం తన కార్యాలయంలో మీడియాతో జరిగిన పరిచయ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. గ్రామాల్లోని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.