ఈ సారి సంక్రాంతి వార్ ఓ రేంజ్లో ఉండబోతోంది. అయితే సీనియర్ స్టార్ హీరోలు బాలయ్య, చిరు మాత్రం ఫ్యాన్స్‌కు ఊహించని సర్ప్రైజ్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. జనవరి 12న బాలయ్య వీరసింహారెడ్డి, 13న మెగాస్టార్ వాల్తేరు వీరయ్య.. సినిమాలు రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. చాలా రోజుల తర్వాత బాలయ్య, చిరు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడుతుండడంతో.. ఫ్యాన్స్ తగ్గేదేలే అంటున్నారు. ఇప్పటికే నువ్వా, నేనా అన్నట్టుగా అప్డేట్స్ ఇస్తూ ప్రమోషన్స్ చేస్తున్నారు. సాంగ్స్ విషయంలో అయితే.. చూసుకుందాం అంటున్నారు. దాంతో చిరు, బాలయ్య మధ్య గట్టిపోటీ ఉండడం ఖాయమంటున్నారు. అలాంటిది.. బాలయ్య, చిరు కలిసి ఒకే వేదికను పంచుకోబతున్నట్టు తెలుస్తోంది. ముందుగా వీరసంహారెడ్డి థియేటర్లోకి రాబోతున్నాడు కాబట్టి.. జనవరి ఫస్ట్ వీక్‌లో సీమ గడ్డపై గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయాలని అనుకుంటున్నారు. అయితే ఈ ఈవెంట్‌కు బాలయ్యను చీఫ్ గెస్ట్‌గా తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారట. అలాగే ‘వీరసింహారెడ్డి’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా రాబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య.. ఈ రెండు సినిమాలను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. అందుకే పబ్లిసిటీ పీక్స్‌లో చేయాలని చూస్తున్నారు. దాంతో ఒకరి కోసం ఒకరిని గెస్ట్‌గా తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్టు టాక్. ఒకవేళ ఇదే నిజమైతే.. నందమూరి, మెగాభిమానులకు పండగేనని చెప్పొచ్చు. అయితే ఇలాంటి వార్తల్లో ఎంతవరకు నిజముందనేది తెలియాల్సి ఉంది.