PDPL: లేబర్ కోడ్లపై సమరశంఖం పూరిస్తూ మార్చి 16న పెద్దపల్లి కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించనున్నట్లు ఐఎస్టీయూ ప్రకటించింది. 11ఏ గని వద్ద మల్లేశం, శేఖర్ పోస్టర్ విడుదల చేశారు. కేంద్రం తెస్తున్న 4 కొత్త చట్టాలు ఏప్రిల్ 1 నుంచి అమలైతే కార్మికుల బతుకులు అంధకారమవుతాయని మండిపడ్డారు. హక్కుల రక్షణ కోసం కార్మికులంతా ఈ పోరాటంలో పాల్గొనాలన్నారు.