CM JAGAN: ఆంధ్రప్రదేశ్‌లో క్రీడలకు ప్రాధాన్యం ఇస్తామని సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM JAGAN) తెలిపారు. ఇక నుంచి ‘ఆడుదాం ఆంధ్ర’ (Adudam andhra) పేరుతో క్రీడా సంబరాలను నిర్వహిస్తామన్నారు. అధికారులతో ఈ రోజు సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రామస్థాయి నుంచి అన్నీ క్రీడా పోటీలను నిర్వహిస్తామని సీఎం జగన్ (CM JAGAN) అన్నారు.
అన్ని నియోజకవర్గాల్లో క్రికెట్, బ్యాడ్మిటన్, వాలీబాల్, కబడ్డీ పోటీలను నిర్వహించాలని సీఎం జగన్ (CM JAGAN) స్పష్టం చేశారు. క్రికెట్ పోటీలకు సీఎస్కే మార్గ నిర్దేశనం చేస్తోందని తెలిపారు. మూడు స్టేడియాల్లో యువతకు క్రికెట్ శిక్షణ ఇస్తుందని సీఎం జగన్ వివరించారు. క్రికెట్‌కు సంబంధించి ముంబై ఇండియన్స్ (ఎంఐ) సహకారం తీసుకుంటాం అన్నారు. వచ్చే సీజన్ వరకు ఏపీ నుంచి ఐపీఎల్ టీమ్ వచ్చేలా కృషి చేస్తామని వివరించారు. అంబటి రాయుడు, కేెఎస్ భరత్ సేవలను వినియోగించుకోవాలని అధికారులకు సీఎం జగన్ సూచించారు
ఐపీఎల్లో తెలంగాణ నుంచి సన్ రైజర్స్ హైదరాబాద్ ఉంది. అంతకుముందు దక్కన్ చార్జర్జ్ ఉండే.. తర్వాత అదీ సన్ రైజర్స్ హైదరాబాద్ అయ్యింది. ఆ టీమ్‌ను సన్ నెట్ వర్క్ గ్రూప్ తీసుకుంది. ఏపీ నుంచి ఐపీఎల్ టీమ్ లేదు. రెండు, మూడేళ్ల క్రితం గుజరాత్ లయన్స్, లక్నో సూపర్ జాయింట్స్ ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆంధ్ర జట్టు రావాలని సీఎం జగన్ కోరుకుంటున్నారు. వచ్చే రెండేళ్లలో ఆ ప్రయత్నం సక్సెస్ అవుతుందని కొందరు క్రీడాభిమానులు చెబుతున్నారు.