Pawan Kalyan: చెప్పులతో కొడతా అని వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని చేసిన కామెంట్లపై అదేవిధంగా స్పందించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan). పాకిస్థాన్ సరిహద్దులకు తీసుకొచ్చి గుర్రం మీద రైడ్ చేయాలని సెటైర్లు వేశారు. వైసీపీ నేతల కామెంట్స్ ఇబ్బంది కలిగిస్తున్నాయని.. సినిమాల్లో కూడా వాడటానికి తాను ఇబ్బంది పడతానని చెప్పారు. ఏదైనా ఒక అంశం మీద సీరియస్గా మాట్లాడాలని సూచించారు. సీరియస్ పాలిటిక్స్ చేయాలే తప్ప.. ఇలా కాదన్నారు. వైసీపీ నేతల కామెంట్లకు తాను మాటలతో సమాధానం చెప్పానని స్పష్టంచేశారు. అయినప్పటికీ వారి తిట్లను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నానని వివరించారు. వైసీపీ నేతలు తనపై చేసిన కామెంట్లకు ఏడాది తర్వాత చింతించే పరిస్థితి వస్తోందని పేర్కొన్నారు. మీడియా ముందుకు వచ్చి.. వారే సారీ చెబుతారని ధీమా వ్యక్తం చేశారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలులో జరిగిన జనవాణి కార్యక్రమంలో పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మాట్లాడారు.
జనవాణిలో 34 పిటిషన్స్ తీసుకున్నామని పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తెలిపారు. రిజర్వాయర్ సమస్య, కాలువల ఆధునీకరణ, స్థలాల కబ్జా, చెరువుల్లో మట్టితీత గురించి ప్రస్తావించారు. చెరువుల్లో ఏడాదికోసారి పూడిక తీయాలి.. 45 అడుగుల మేరా తోడారని తమ దృష్టికి వచ్చిందని వివరించారు. మత్స్యకారుల సమస్య, యువతకు ఉపాధి ఇష్యూ గురించి ప్రస్తావించారు. కర్ణాటకలో 2 వేల పైచిలుకు పరిశ్రమలు ఉంటే.. తెలంగాణలో 10 వేలకు పైగా పరిశ్రమలు ఉన్నాయని అంటున్నారు. ఏపీలో ఏ పరిశ్రమ లేదని పేర్కొన్నారు. పోని.. వర్క్ ఫ్రం హోం చేద్దామని అనుకుంటే.. కరెంట్ బిల్లు వాత చూసి భయపడుతున్నారని గుర్తుచేశారు. ఇంటిపట్టున ఉండి పనిచేసినా.. రూపాయి మిగిలే పరిస్థితి లేదని చెప్పారు.
— JanaSena Shatagni (@JSPShatagniTeam) June 15, 2023
తమకు వచ్చిన పిటిసన్లపై అధ్యయనం చేస్తామని పవన్ (Pawan) తెలిపారు. రేపటి బహిరంగ సభపై మాట్లాడతామని పేర్కొన్నారు. వారాహి విజయ యాత్ర ఏపీ రాజకీయాలను మార్చేలా ఉంటుందని చెప్పారు. చివరిగా ఏపీ అభివృద్ధే తమకు కావాలని కోరారు. ఆంధ్రా అనే భావనతో ముందుకెళ్లాలని.. కులాల పేరుతో కొట్టుకోవద్దని సూచించారు.