MDK: శివంపేట మండలం చిన్న గొట్టిముక్కలలో రోడ్డుపై ఉన్న విద్యుత్ స్తంభం, దానికి సంబంధించిన తీగలు కిందకు వంగి ఉండటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాహనాల రాకపోకలకు ఆటంకం కలుగుతుండగా, ప్రమాదాలకు కూడా అవకాశం ఉందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.