శబరిమల ఆలయంలో భక్తుల రద్దీ పోటెత్తింది. అయ్యప్ప స్వామి దర్శనానికి ఏకంగా 12 గంటలకు పైగా సమయం పడుతోంది. డిసెంబర్ 30 నుంచి మకరవిళక్కు దర్శనాలు ప్రారంభం కావడంతో భక్తులు భారీగా తరలివస్తున్నారు. కిలోమీటర్ల మేర క్యూలైన్లు కనిపిస్తున్నాయి. స్వామివారి నామస్మరణతో సన్నిధానం మార్మోగుతోంది. భక్తులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు చేపడుతున్నారు.