గతేడాది వరుస హిట్లు అందుకున్న రష్మిక.. ఇప్పుడు ‘కాక్టెయిల్ 2’తో సందడి చేయనుంది. షాహిద్ కపూర్, కృతి సనన్‌తో కలిసి ఆమె నటిస్తున్న ఈ రొమాంటిక్ కామెడీకి హోమి అదజానియా దర్శకుడు. సెప్టెంబర్‌లో సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. హిట్ మూవీ ‘కాక్టెయిల్’కు సీక్వెల్‌గా వస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉండగా, త్వరలో అధికారిక ప్రకటన రానుంది.