నిజమే.. ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పొలిటికల్ పార్టీ పేరు, మరియు దాని గుర్తు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే చరణ్ ఏదో నిజంగానే రాజకీయ పార్టీ పెట్టాడనుకునేరు.. ప్రస్తుతం చరణ్ నటిస్తున్న ఆర్సీ 15 సినిమాలోని పార్టీ గుర్తు గురించి ఇంట్రెస్టింగ్గా చర్చించుకుంటున్నారు అభిమానులు. స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఆర్సీ 15 లేటెస్ట్ షెడ్యూల్ షూటింగ్ రాజమండ్రిలో జరుగుతోంది. అక్కడ గోదావరి తీర ప్రాంతంలో.. ఈ సినిమా కోసం వేసిన పలు సెట్టింగ్స్ తాలూకు ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై రామ్ చరణ్ ఫ్యాన్స్ మండి పడుతున్నారు. ఇలాంటి లీక్డ్ పిక్స్ బయటకు రాకుండా RC 15 యూనిట్ జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు. కానీ మొదటి నుంచి ఆర్సీ 15కు లీకుల బెడద తప్పడం లేదు. అయితే ఈసారి సినిమాలోని కీలక ఘట్టమే లీక్ అయిపోయింది. ఈ సినిమాలో చరణ్ తండ్రి కొడుకుగా డ్యూయెల్ రోల్ చేస్తున్నాడు. ప్రస్తుతం తండ్రి పాత్రకు సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ చిత్రీకరణ జరుగుతోంది. అయితే ఈ సినిమాలో తండ్రి పాత్ర రాజకీయంగా.. చాలా పవర్ ఫుల్‌గా ఉంటుందట. దాంతో ఇప్పుడు ఎన్నికల ప్రచారానికి సంబంధించిన సన్నివేశాన్ని తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. అందులోభాగంగా.. రామ్ చరణ్ పార్టీ పేరు అభ్యుదయ పార్టీ అని.. దాని గుర్తు ట్రాక్టర్ అని తెలుస్తోంది.. లీక్ అయిన ఫోటోల్లో ఈ విషయం క్లియర్ కట్‌గా కనిపిస్తోంది. దాంతో ఆర్సీ 15 లేటెస్ట్ షెడ్యూల్.. ఈ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేసింది. మరి శంకర్ మార్క్‌లో వస్తున్న ఈ పొలిటికల్ థ్రిల్లర్ ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.