VZM: దత్తిరాజేరు మండలం కోమటి పల్లి సమీపంలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో పెద మేడపల్లికి చెందిన రెడ్డి శ్యామలకు తీవ్ర గాయాలయ్యాయి. స్దానికుల వివరాల ప్రకారం.. మానాపురం నుంచి వస్తున్న ఆమె స్కూటీని ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదంలో జరిగిందన్నారు. గాయపడిన మహిళను 108 వాహనంలో గజపతినగరం ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.