విజయ్ హజారే ట్రోఫీలో హైదరాబాద్ తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. వరుసగా నాలుగు ఓటముల తర్వాత, నేడు చండీగఢ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఘనవిజయం సాధించింది. కెప్టెన్ తిలక్ వర్మ (109 పరుగులు) సూపర్ సెంచరీతో రాణించడంతో హైదరాబాద్ నిర్ణీత ఓవర్లలో 286 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యఛేదనలో చండీగఢ్ 37.4 ఓవర్లలో కేవలం 150 పరుగులకే ఆలౌటైంది.