WG: నూతనంగా ఏర్పాటైన మార్కాపురం జిల్లా పోలీస్ కార్యాలయాన్ని శనివారం జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీ హర్షవర్ధన్ రాజు సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయ ప్రాంగణాన్ని, వివిధ విభాగాల నిర్వహణకు అందుబాటులో ఉన్న సౌకర్యాలను ఎస్పీ పరిశీలించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో డీసీఆర్బీ, స్పెషల్ బ్రాంచ్, ఐటీ కోర్ విభాగాలను ఏర్పాటు చేయుటకు గదులను పరిశీలించారు.