TG: సంక్రాంతికి ప్రయాణికుల రద్దీ లేకుండా చూస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. సంక్రాంతికి టోల్ఫీజుపై కేంద్రమంత్రి గడ్కరీకి లేఖ రాశామని చెప్పారు. టోల్‌ప్లాజాలు కేంద్రం ఆధీనంలో ఉన్నాయని గుర్తు చేశారు. మేడారం వెళ్లే భక్తులకు కూడా టోల్ ఫీజు విషయంలో మినహాయింపును పరిశీలిస్తున్నామని స్పష్టం చేశారు.