BHPL: జిల్లా ఐడీవోసీ కార్యాలయంలో శనివారం భూ భారతి, 22-ఏ, సాదా బైనామా, అసైన్డ్ భూముల దరఖాస్తులపై మండల తహసీల్దార్లతో కలెక్టర్ రాహుల్ శర్మ సమీక్ష నిర్వహించారు. పెండింగ్ దరఖాస్తుల స్థితిగతులను సమీక్షించి నిబంధనల ప్రకారం వేగవంతంగా పరిష్కరించాలని ఆదేశించారు. పోర్టల్‌లో అప్లోడ్ చేస్తున్నా ఫైల్స్ ఫిజికల్‌గా పంపకపోవడం పెండింగ్‌కు కారణమని తెలిపారు.