KKRకు బిగ్ షాక్ తగిలింది. రూ.9.20 కోట్లు పెట్టి కొన్న బంగ్లా పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్‌ను వదిలేయాలని BCCI ఆదేశించింది. దీంతో అతడు ఈ సీజన్‌కు దూరమయ్యాడు. అయితే, వేలంలో ఖర్చు చేసిన మొత్తం KKRకు తిరిగి వస్తుందా? లేదా? అనే దానిపై క్లారిటీ లేదు. సాధారణంగా ప్లేయర్ గాయపడితే బీమా వర్తిస్తుంది కానీ, ఇలాంటి పరిస్థితుల్లో రీఫండ్ కష్టమేనని విశ్లేషకులు అంటున్నారు.