JGL: ప్రభుత్వ ఆసుపత్రిలోనే మెరుగైన వైద్య సేవలు అందుతాయని సారంగాపూర్ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ రాధారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆమె శుక్రవారం గర్భిణీలకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందించారు. కడుపులో బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే మంచి పౌష్టికాహారం తీసుకోవాలన్నారు.