NZB: తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని బీ.ఈడీ, B.PED పరీక్షల ఫీజు చెల్లింపు గడువును వర్సిటీ అధికారులు పొడిగించారు. 2026 విద్యా సంవత్సరం I, III సెమిస్టర్ రెగ్యులర్‌తో పాటు బ్యాక్ లాగ్ పరీక్షల ఫీజు గడువు డిసెంబర్ 29తో ముగియగా ఆ గడువును జనవరి 16వ తేదీ వరకు పొడిగించినట్లు పరీక్షల నియంత్రణ అధికారి ప్రొ.సంపత్ కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.