అన్నమయ్య: రైల్వే కోడూరు మండలం శెట్టిగుంటకు చెందిన గాజుల పిచ్చయ్యకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన రూ.34,300 చెక్కును ఆయన నివాసంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరవ శ్రీధర్, టీడీపీ ఇంఛార్జ్ ముక్కా వరలక్ష్మి అందజేశారు. కష్టాల్లో ఉన్న అర్హులైన కుటుంబాలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు.