ELR: బుట్టాయిగూడెం మండలం బూసరాజుపల్లి టీపీపీ కార్యాలయంలో శుక్రవారం పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ట్రై కార్ ఛైర్మన్ బొరగం శ్రీనివాసులు పాల్గొని ప్రజల వద్ద నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రధానంగా పెన్షన్ సమస్యలు, సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మాణం, చెరువుల మరమ్మతు పనుల గురించి వినతలు వచ్చాయనట్లు ఆయన తెలిపారు.