ఏలూరులోని సత్రంపాడు ZPHS ఆవరణకు ఆనుకుని ఉన్న వాటర్ ట్యాంక్ ప్రమాదకరంగా మారింది. దశాబ్దాల క్రితం నిర్మించిన ఈ ట్యాంక్ ప్రస్తుతం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుని, ఏ క్షణాన కూలిపోతుందో తెలియని స్థితిలో ఉందని స్థానికులు తెలిపారు. భయానక స్థితిలో పిల్లర్లు, ట్యాంక్పై పిచ్చిమొక్కలు, నిర్వహణ లేక కొన్నిఏళ్లుగా నిరుపయోగంగా ఉందని, అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.